తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హరీష్ రావు తండ్రి మృతిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు..తన బావ తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన 7వ సోదరి, అక్క లక్ష్మీ భర్త.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ. బావతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.

