నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. జోగి రమేశ్, రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు.

