తెలుగు పాఠకులకు సుపరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావును ఉన్నత పదవి వరించింది. తన కళా నైపుణ్యంతో విశేష గుర్తింపు పొందిన ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాతో గౌరవించింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్‌ను నియమిస్తూ శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.

