మాగంటి గోపినాథ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం వివాదాల్లోకి తనను లాగొద్దని కోరారు. గోపినాథ్ మరణంపై ఆయన తల్లి కొన్ని ఆరోపణలు చేశారని.. గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉంటే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, బిఆర్ఎస్, బిజెపి చేసింది శూన్యమని ఆయన అన్నారు.

