జేడీయూ అధినేత నితీశ్ కుమార్, బీజేపీ అభ్యర్థి రమా నిషాద్ మెడలో పూలమాల వేశారు. పక్కనే ఉన్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా సీఎం చేయి పట్టుకుని ఆపినా ఆగకుండా ఆమె మెలలో పూలమాల వేశారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘నితీశ్ ఆరోగ్యం బాగుందా?’ అని ఎక్స్‌లో కామెంట్ చేశారు. మంగళవారం ముజఫర్‌పుర్ జిల్లాలోని మీనాపుర్ నియోజకవర్గంలో తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నితీశ్ ప్రారంభించారు.

