
తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. యూరియా కోసం మహిళా రైతులు పడుతున్న తిప్పలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కనిపిస్తుందా.. వినిపిస్తుందా.. గౌరవ ముఖ్యమంత్రి గారూ.. మీ పాలనలో అందరీలాగే మహిళ రైతులకు కూడా ఇబ్బందులేనా..? ఇదిగో జర చూడండి అని యూరియా కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సబితా ఇంద్రారెడ్డి.