భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్గా సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన నియమితులయ్యారు. ఇది తనకు దక్కిన ప్రత్యేకమైన గౌరవంగా స్మృతి పేర్కొన్నారు. భారత మహిళా క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకెళ్లెందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. భారత మహిళల క్రికెట్లో స్మృతి మంధాన కీలక ఆటగాళ్లలో ఒకరు. 2013లో భారత జట్టులోకి అడుగుపెట్టిన ఆమె, దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతోంది. ఇప్పుడు నాయకత్వ బాధ్యతను పూర్తిస్థాయిలో స్వీకరించనుంది.

