పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఒంటరిగా ఉంటున్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై, ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. సాయంత్రం సమయంలో ఎవరో తలుపు తట్టడంతో ఆమె తలుపులు తెరిచారు. వెంటనే లోపలికి ప్రవేశించిన నిందితుడు కత్తితో ఆమెను బెదిరించి ఆమె చున్నీతోనే కాళ్లు, చేతులు కట్టేసి నోరు నొక్కేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

