ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం వస్తుంది. నా మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయి, ఏడాదిలో లక్షమంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు అన్నారు.గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వా రుచి చూసి టేస్ట్ బాగుందని నిర్వాహకులను అభినందించారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను సీఎం ఆసక్తిగా తిలకించారు.

