
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్‌కు భారత్ నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది.ఆతిథ్య దేశం భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.