మహాలక్ష్మి పథకాన్ని ఎప్పటికి అమలు చేస్తారంటూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడును షర్మిల ప్రశ్నించారు. “రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతీగతి లేదు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ, మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

