
మహారాష్ట్ర నుంచి నకిలీ ఘడీ బ్రాండ్ డిటర్జెంట్ పౌడర్ ను తరలిస్తున్న వాహనాన్ని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువైన 15 క్వింటాళ్ల డిటర్జెంట్ పౌడర్ ను మహారాష్ట్ర అమరావతి నుంచి ఆదిలాబాద్ కు చెందిన రూపేష్ అగర్వాల్ కు విక్రయించే క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండు వద్ద పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో నకిలీ ఉత్పత్తులను తరలించి విక్రయించే వారి సమాచారం తెలిస్తే పోలిసులకు సమాచారం ఇవ్వాలని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
.