
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు బాధితుడు రామచంద్రం అనే వ్యక్తిని రెవెన్యూ, పోలీసులు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపించేశారు. ఖాళీ చేయిస్తున్న సమయంలో రామచంద్రం కుటుంబ సభ్యులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.కుటుంబ సభ్యులు అధికారుల కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. పోలీసులు వారిని బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించి మరో వ్యక్తికి ఆ ఇంటిని కేటాయించారు.
దీంతో మనస్తాపం చెందిన రామచంద్రం కుటుంబం నిన్నటి నుంచి కన్పించకుండా పోయింది.