ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించి మరో ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చైనా గూఢచారితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీలోని మరో ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ బాంబు పేల్చింది. హువాంగ్‌కు, తన కింద పనిచేసే ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

