
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వరుస వివాదాలు వెంటాడున్నాయి. కొత్తగా HCAతో పాటు పలువురు ప్లేయర్సపై అనంత్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం నడిచిందని కంప్లైంట్ ఇచ్చారు. ఆయా విభాగాల్లో స్థానం పొందేందుకు పలువురు ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. HCA నిర్లక్ష్యంతో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని అనంత్‌రెడ్డి ఆరోపించారు