భారత క్రికెటర్ రాహుల్ చాహర్, తన భార్య ఇషానీ జోహార్‌తో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన వీరి వివాహ బంధం ముగియడంపై రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. గత కొద్ది కాలంగా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత స్పిన్నర్ రాహుల్ చాహర్, తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్‌తో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

