నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని సోమవారం రోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

