
ట్విట్టర్ ను కొనుగోలు చేసి దాని పేరును X గా మార్చిన మస్క్, ఇప్పుడు మరొక కంపెనీ పై కన్నేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ Open AI కు ముందుగా సహ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్న మస్క్ దాని నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు Open AI ని కంట్రోల్ లోకి తీసుకునే విధంగా ఈ సంస్థ కోసం ఏకంగా 97.4 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, ఈ బిగ్ ఆఫర్ ను ఏ మాత్రం పట్టించుకోని సామ్ ఆల్ట్‌మాన్ సున్నితంగా తిరస్కరించారు