హైదరాబాద్ మెట్రో రైలులో ఇటీవలే సాంకేతిక లోపం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెట్రో రైలులో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. సాంకేతిక లోపంతో మెట్రో రైలు జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దాదాపు 10 నిమిషాలపాటు రైలు ఆగిపోవడంతో ఆయా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందికి లోనయ్యారు.

