
బ్యాంకుల విలీనానికి మరోసారి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకుల కార్యకలాపాల సామర్థ్యం పెంచడం, ఖర్చుల హేతుబద్ధీకరణ చేపట్టడమే లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమేరకు దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లను 28కి కుదించనున్నట్లు పేర్కొంది. ఒక రాష్ట్రం- ఒక ఆర్ఆర్‌బీ(Regional Rural Bank) ప్రణాళికను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు.