
భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై, కెసిఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని కొనియాడారు. సభ ద్వారా భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ స్వయంగా తానే ముందుండి పోరాడతాను అని ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.