కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెరియపట్నంలో గుల్ఫామ్ తాజ్ (23), ఆమె సోదరి సిమ్రాన్ తాజ్ (20), గుల్ఫామ్ తాజ్‌కు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఫ్యామిలీ అంతా బిజీగా ఉంది. ఇద్దరు సిస్టర్స్ స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లి గీజర్‌ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్ పీల్చడంతో శ్వాస ఆడక సిస్టర్స్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. గీజర్ నుంచి లీకైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ యువతులు మరణించినట్లు మరణించినట్లుగా డాక్టర్లు వెల్లడించారు

