మరికాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా రాజమౌళి – మహేశ్ సినిమా గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో జరుగబోతున్న ఈ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి అనేది వెల్లడించాడు. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో టైటిల్‌తో పాటు, సినిమాకు సంబంధించిన ఫిక్షనల్ వరల్డ్‌ని పరిచయం చేస్తూ విజువల్స్ కూడా రాబోతున్నాయని తెలిపాడు. అలాగే ఈవెంట్లో ఏర్పాటు చేసిన 100 అడుగుల భారీ తెరపై సినిమా అనౌన్స్మెంట్ వీడియోను ప్రదర్శించిన అనంతరం ఆన్లైన్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు.

