ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు మరణ శిక్ష విధించడాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదని ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ బంద్ ప్రకటించింది.ఆమెను అప్పగించాలని భారత్‌కు బంగ్లా విజ్ఞప్తి చేసింది.

