ఉత్తర ప్రదేశ్లో సోషల్ మీడియా రీల్స్ తీస్తుండగా ఐదుగురు స్నేహితులు నదిలో మునిగిపోయారు. గోరఖ్పూర్ జిల్లా రాప్తి నదిలోని మీర్జాపూర్ ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నలుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. రాణిదిహా సమీప ప్రాంతాలకు చెందిన ఐదుగురు స్నేహితులు, తమ సైకిళ్లపై విన్యాసాలు చేస్తూ, వీడియోలు తీస్తూ మీర్జాపూర్ ఘాట్లో స్నానం చేసి రీల్స్ చేయాలని లోతైన నీటిలోకి దిగి మునిగిపోగా రాజ్కరణ్ సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

