
భారతీయ భాషలలో తార్కికతకు మద్దతు ఇచ్చే భారతదేశ ప్రాథమిక AI మోడల్ ఆరు నెలల్లో సిద్ధంగా ఉంటుందని సర్వం AI వ్యవస్థాపకులు వివేక్ రాఘవన్ చెప్పారు. అది తాము నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యమని(టైం లైన్) రాఘవన్ తెలిపారు. “వాస్తవానికి మేము భారతీయ భాషలలో(Indic languages) తార్కికతను నిర్మిస్తున్నాము” అని రాఘవన్ వెల్లడించారు. “కాబట్టి, మీరు ఏ భాషలోనైనా, ఏ లిపిలోనైనా ప్రశ్నలు అడగవచ్చు, అది దేవనాగరి లేదా రోమన్ లిపి హింద్ అయినా, మన మోడల్ ప్రతిస్పందిస్తుంది.” అని చెప్పారు.