మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’స్పెషల్ ప్రీమియర్‌తో పాటు, టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న మెగా మూవీ స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం కల్పించింది. అలాగే, రోజుకు 5 షోలకు కూడా అనుమతి ఇచ్చింది.

