
జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్‌లో ప్రధాన మంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తార్నారు.