తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 4822 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. రంగారెడ్డి డివిజన్‌లో అత్యధికంగా 29,420 దరఖాస్తులు రాగా, అదిలాబాద్ డివిజన్‌లో అత్యల్పంగా 4154 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు ఈ నెల 27వ తేదీన డ్రా నిర్వహించనున్నారు. 27న ఉదయం 11 గంటలకు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపులకు డ్రా తీయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

