శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం షాపులు ముసివేయాలని కమిషనర్లు విసి సజ్జనార్, రమేష్, అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, మిలట్రీ క్యాంటీన్లు, క్లబ్బులను మూసివేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

