ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ అలెర్ట్ అయ్యాడు. బస్సును వెంటనే రోడ్డు పక్కన ఆపాడు. అందులో ఉన్న 12 మంది ప్రయాణికులను సకాలంలో నుంచి దించివేశాడు. ఆ తర్వాత ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మహారాష్ట్రలో. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ స్లీపర్ బస్సు ముంబై నుంచి జల్నాకు వెళ్తున్నది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగ్‌పూర్ జాతీయ రహదారిలో ఆ బస్సుకు మంటలు అంటుకున్నాయి.

