ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భయానక స్థాయికి చేరింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌పై జరిపిన మెరుపు దాడుల్లో మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్ తీవ్రంగా దెబ్బతింది. బాంబుల దాడిలో విమానాలు మంటల్లో చిక్కుకోగా, టెహ్రాన్ ఆకాశం పొగతో నిండిపోయింది. గత వారం రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ అగ్రనేతలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ దాడులతో చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్నాయి.

