
కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహిస్తుందని ఎవరికి అన్యాయం జరగకుండా, హక్కులకు భంగం లేకుండా పారదర్శకంగా భూ సర్వే జరుగుతుందని తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 15న పంపిణీ చేయనున్నట్టుగా తెలిపారు. వీటిని ఉచితంగానే రైతులకు అందజేస్తామని చెప్పారు. వివిధ రకాల భూములకు వేర్వేరు రంగులతో కూడిన పాస్‌బుక్‌లు అందజేయనున్నట్టుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. భూములకు ఆధార్, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.