
భూటాన్ లో వరదలు ముచ్చెత్తుతున్నాయి. గత కొన్నిరోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు భూటాన్ అతలాకుతలమైంది. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సిఉంది. అయితే భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు కొట్టుకునిపోయాయి. ఇక బ్రిడ్జ్లు కొట్టుకునిపోవడంతో కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వారిని ఆదుకునేందుకు భూటాన్ అధికారులతో పాటు భారత సైనికులు సహాయక చర్యలు చేపట్టారు.