తెలుగు పాప్ మ్యూజిక్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సింగర్ స్మిత . తాజాగా ‘భీమవరం బీట్’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. భీమవరం బీట్’ పాటను ర్యాపర్ నోయల్ తో కలిసి స్మిత రూపొందించారు. ‘భీమవరం బీట్’ పాటలో ఇంకో స్పెషల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సందడి చేశారు. స్మితతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

