
ఆధునిక సాంకేతికత.. మనుషుల మధ్య అంతరాలను తగ్గిస్తున్నది. దేశాల హద్దులను చెరిపేస్తూ.. ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తున్నది. యాప్ వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అన్ని భాషలనూ మాతృభాషలోకి మార్చేసే ‘మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్’ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే చాట్ మెసేజ్‌లను అనువాదం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇతర దేశాల్లో పర్యటించేటప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ‘ఆండ్రాయిడ్’లో నాలుగైదు నెలల నుంచే అందుబాటులో ఉన్న ఈ ‘మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్’.. త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకూ చేరువకానున్నది.