 
		అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance ఇరకాటంలో పడ్డారు. హిందూ మతానికి చెందిన తన భార్య ఉషా వాన్స్.. క్రైస్తవ మతాన్ని స్వీకరించాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల జేడీ వాన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మెసిసిప్పిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ మీటింగ్‌లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన భార్య ఉషా తనతో చర్చికు హాజరవుతోందని, కానీ ఆమె ఏదో ఒక రోజు పూర్తిగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
 
      
 
								 
								