సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోదరుడు, పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణా యాదవ్‌కు విడాకులు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ‘‘ఈ స్వార్థపరురాలైన మహిళకు నేను వీలైనంత త్వరగా విడాకులు ఇవ్వబోతున్నాను’’ అని ప్రతీక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అపర్ణపై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆమె కుటుంబ సంబంధాలను దెబ్బతీసిందని ఆరోపించారు. అపర్ణ కేవలం ఆమె కీర్తి, పలుకుబడిపైనే దృష్టి పెట్టిందని ఆరోపణలు చేశారు

