
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు పెరగడంతో పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా… శనివారం ఉదయం వరకు నీటి మట్టం 513.41 మీటర్లకు చేరుకుంది. హుస్సేన్ సాగర్ నాలుగు తూము గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.