
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా సికింద్రాబాద్‌లోని పైగా కాలనీ నీటమునిగింది. భారీ వర్షాల కారణంగా కాలనీలోని రోడ్లు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు నీటమునిగాయి. కొన్ని పరిశ్రమలు , షోరూమ్‌లలో కూడా వరద నీరు చేరింది, దీని వల్ల అక్కడ ఉద్యోగులు చిక్కుకుపోయారు. పైగా కాలనీ నివాసితులు ఈ వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి వర్షాకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు