
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన మయన్మార్‌లో మృతుల సంఖ్య 1,644కు పెరిగిందని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. అంతేగాక, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య 3408కి పెరిగిందని, 139 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపింది. పలు దేశాలు సహాయక సామగ్రిని, సిబ్బందిని పంపిస్తున్నప్పటికీ, ఫ్లైట్స్ లాండ్ చేయడానికి అనువుగా విమానాశ్రయాలు లేవని పేర్కొంది.