తెలుగు వారి కొత్త ఏడాది ఉగాది పండుగ నాడు స్టాక్ మార్కెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనివల్ల కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు రూ. 12 లక్షల కోట్ల వరకు నష్టపోయారు. గ్యాస్ ప్లాంట్లపై దాడులు జరుగుతాయనే ఆందోళనతో గ్లోబల్ మార్కెట్లు వణికిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం భారతీయ సూచీలపై పడింది. ఆటోమొబైల్ మరియు బ్యాంకింగ్ షేర్లు భారీగా ఒత్తిడిని ఎదుర్కోవడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది.

