వారంతపు తొలి రోజైన సోమవారం (మార్చి 30) దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచే ప్రతికూల సంకేతాలతో ప్రారంభమైన ట్రేడింగ్, సమయం గడిచేకొద్దీ మరింత బలహీనపడి ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది.
ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు (2.22%) పతనమై 71,947.55 వద్ద స్థిరపడగా, నేడు మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ (Nifty) 488.20 పాయింట్లు (2.14%) నష్టంతో 22,331.40 వద్ద ముగిసింది. అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బలహీనపడింది.

