భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రభుత్వం నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
ఆయన నవంబర్ 24న ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన దాదాపు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేయనున్నారు.

