
ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ కంటే ముందే..భారత వెబ్‌సైట్లు, సర్వర్లపై హ్యాకింగ్‌కు పాల్పడ్డ పాక్ హ్యాకర్లు.. డేటాను చోరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత సైనిక రైళ్ల కదలికలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా రైల్వే శాఖ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచనలు జారీ చేసింది.