78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదే జాతినుద్దేశించి ప్రసంగించారు. ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు.