
యంగ్ డైనమైట్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నయా రికార్డును నమోదు చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఇషాన్ కిషన్.. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీపూర్తిచేసుకున్న అతను.. మరో 20 బంతుల్లోనేసెంచరీమార్క్ అందుకున్నాడు. సన్ రైజర్స్ తరఫున ఇప్పటివరకు విదేశీ ఆటగాళ్లు మాత్రమే శతకాలు సాధించారు.