
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితిపై సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందిస్తూ తాము దీని పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దాడులను ఖండిస్తున్నామని, పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవడానికి గరిష్ట సంయమనం పాటించాలని భారత్, పాక్ ప్రభుత్వాలను కోరారు.