
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా పతనం అయ్యాయి. పశ్చిమాసియాలోని భారత్ మిత్ర దేశం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ లో పోస్టు చేశారు. భారత్-పాకిస్తాన్మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరిక సంబంధాలు ఉన్నాయని తాము కూడా వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా మధ్యవర్తిత్వానికి అంగీకరించాలని ఇరుదేశాల్ని కోరారు.