హార్మూజ్ జలసంధి వద్ద థాయ్ లాండ్ కు చెందిన కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. థాయ్ లాండ్ జెండాలు కలిగిన మయూరీ నారీ అనే కార్గో నౌక థాయ్ లాండ్ కు చెందిన ప్రీషియస్ షిప్పింగ్ పీసీఎల్ అనే సంస్థకు చెందినది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరింది. హార్మూజ్ జలసంధి గుండా ఈ నౌక గుజరాత్ లోని ఖండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. దాడుల సమయంలో కార్గో నౌకలో 23 మంది నావికులలో ముగ్గురు గల్లంతు అయినట్లు సమాచారం.

